చరిత్ర

విష్ణుకుండినులు మరియు కళ్యాణ చాళుక్య రాజవంశీకులు, అయిదవ శతాబ్దంలో,  ఉండ్రుగొండ గిరిదుర్గాన్ని నిర్మించారు. ఆ తరువాత  కుందూరు ఛోళులు, రేచెర్ల పద్మనాయకులు ఇంకా రెడ్డి రాజులు, ఇలా ఎన్నో రాజవంశాలు,  వారివారి పాలనలో, గిరిదుర్గాన్ని అభివృద్ధి చేసారు. ఆ తరువాత, కాకతీయులు, బహమనీ సుల్తానులు, విజయనగర రాజులు, ఆజంజాహి రాజులు, వారి సామాంతరాజులతో పాలించడం జరిగింది. బ్రిటీషు పురాతత్వవేత్త రాబర్ట్ స్వెల్, నిజాముల కాలంలో, ఈ కోటని సందర్శించి, పద్దెనిమిది వందల యాభై రెండులో ముంద్రించిన తన ఆర్టికల్ “Archaeological remains in the presidency of Madras, Varanasi”లో  దీన్ని ప్రస్తావించడం జరిగింది.

నిజాం రాజ్యాన్ని, భారత యూనియన్, ఆక్రమించుకునే సమయంలో కూడా ఈ కోటకి ప్రాముఖ్యత ఉంది. భారత యూనియన్, గోల్కొండను చేరుకునే దారిలో, వారిని  అడ్డుకునేందుకు, నిజాం నవాబు, ఖాసిం రజ్వి సైన్యాన్ని ఉండ్రుగొండ కోట వద్ద మోహరించాడని చెపుతుంటారు.  తెలంగాణా రైతాంగ పోరాటంలో కూడా ఈ కోట, తనవంతు పాత్ర పోషించింది.

Our Newsletter

Share This