ఆర్కియాలజీ

పదిహేను వందల ఎకరాలలో విస్తరించి ఉన్న ఈ గిరిదుర్గం, మొత్తం ఎనిమిది గుట్టలు, వివిధ ప్రాకారాలు, రక్షణ కోసం ఏర్పాటు చేసిన దర్వాజాల సముదాయం. క్రింద ఉన్నవి మొదటి ప్రాకారంలోని వివిధ కోట గోడల నడుమ ఉన్న ముఖ్యమైన కట్టడాలు.

దిగువ ప్రాకారంలోని మరికొన్ని ప్రాచీన కట్టడాలు

ఇరవై అడుగుల పొడవు, పదిహేను అడుగుల వెడల్పుతో ఉన్న ధృడమైన రాతితో చేసిన కోటగోడలు, రాతి మెట్లు, రకరకాల రక్షణా వలయాలతో కూడిన దర్వాజాలు కలవు. కోటని చేరుకోవడానికి శత్రుసైన్యం, వివిధ ప్రాకారాల్లోని, ఎనిమిది దర్వాజాలాను దాటిరావాలి.

మూల దర్వాజ:  దూరం నుండి కనపడకుండా, దగ్గరికి చేరుకోగానే కనిపించే రక్షణా ద్వారం.

జాలు దర్వాజ: శత్రువుల అంచనాలను తలక్రిందులు చేసే దర్వాజ. శత్రువులు ద్వారాన్ని చేరుకోగానే, పైన ఉన్నటువంటి కాలువ నీటిని వదలడంతో, వాళ్ళు జారిపడే విధంగా నిర్మించబడింది.

రాతి మెట్లు: కోటలోని పలు చోట్ల, కొండల పైన చెక్కబడ్డ రాతి మెట్లు కనపడతాయి.

  • గుట్టల నడుమ కొన్ని ప్రదేశాల్లో, కృత్రిమంగా నిర్మింపబడ్డ కాలువలు కనబడతాయి. పురాతనకాలంలో ఉపయోగించిన వాననీటిని సంరక్షించే పద్ధతులు గుట్టల్లో చాలా చోట్ల కనబడతాయి. కాలువలన్నిటికీ బలమైన రాతి కట్టుబడులు ఉన్నాయి. నీటిని చేరుకునేందుకు మెట్లు, స్నానానికి, బట్టలు మార్చుకునేందుకు గదులు కూడా ఏర్పాటుచేయబడ్డాయి. అత్యంత ఎత్తులోనున్న “రాజా నర్తకి కొలను” లో సకల వసతులు గల నిర్మాణం ఇప్పటికీ కలదు.

Our Newsletter

Share This